Loading. Please wait.

actress,actors gallery

ఆకట్టుకునే 'హేజా ' టీజర్..!!

మిస్టర్ 7 , యాక్షన్ 3D , చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు
సంగీత దర్శకుడిగా చేసిన మున్నా కాశీ దర్శకత్వం వహిస్తూ హీరో గా చేసిన
చిత్రం "హేజా"..  ముమైత్ ఖాన్, నూతన నాయుడు , లిజి గోపాల్, ప్రీతం నిగమ్
ఇతర పత్రాలు పోషించారు.. కాగా ఈ చిత్రానికి సంగీతం హైలైట్ గా నిలవనుంది..
చాల రోజుల తర్వాత నటి ముమైత్ ఖాన్ ఈ చిత్రం తో రీ ఎంట్రీ స్తుండగా  వి
ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై  కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని
నిర్మించారు..  నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ని అందించారు.. హారర్
చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉండగా చిత్ర బృందం నేడు
టీజర్ ని రిలీజ్ చేసింది..

ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ...  ఇప్పటి వరకు చాల
సినిమా లకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాను.. ఫస్ట్ టైం హీరోగా,
దర్శకుడిగా మరి చేస్తున్న సినిమా ఇది.. ఈ సినిమా కి సపోర్ట్ చేసిన
అందరికి కృతజ్ఞతలు.. ఈ సినిమా తో ముమైత్ ఖాన్ గారు రీ ఎంట్రీ
ఇస్తున్నారు..ఇప్పటివరకు వచ్చిన సినిమా అవుట్ ఫుట్ చాల బాగా ఉంది.. ఈ
సినిమా అందరిని తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు..

Other film news