Loading. Please wait.

actress,actors gallery

అల్ల‌రి న‌రేష్‌ బ‌ర్త్‌డేకి విడుద‌ల కానున్న 'నాంది' ఎఫ్ఐఆర్!

12
హీరో అల్ల‌రి న‌రేష్‌ త్వ‌ర‌లో 'నాంది' అనే విల‌క్ష‌ణ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. స్టార్ డైరెక్ట‌ర్‌ హ‌రీష్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో-డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్ విధించ‌క ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది.జూన్ 30 అల్ల‌రి న‌రేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 'నాంది ఎఫ్ఐఆర్' (ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్‌) పేరిట ఒక చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు . 'నాంది' ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో, ఆందోళ‌న నిండిన ముఖంతో జైలులో న‌గ్నంగా కూర్చొని ఉన్న అల్ల‌రి న‌రేష్‌ను మ‌నం చూశాం. ఆ పోస్ట‌ర్ చూస్తేనే ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని ఒక అసాధార‌ణ పాత్ర‌ను ఆయ‌న చేస్తున్నాడ‌ని అర్థ‌మైపోయింది.

తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్య‌ల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని.

Other news