Loading. Please wait.

actress,actors gallery

అమెరికా వెళ్లనున్న ప్రతిరోజూ పండగే చిత్ర బృందం

ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవందం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన బన్నీ వాస్ నిర్మాతగా అందం అభినయంతో మెప్పిస్తున్న గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం "ప్రతిరోజు పండగే" ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్  సిటీలో జరుగుతోంది. ఆ తరువాత షెడ్యూల్ ని అమెరికాలో షూట్ చేయబోతున్నారు. అలానే అక్టోబర్ 15న సాయి తేజ్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇక  ఇటీవలే రిలీజ్ చేసిన ఈ  సినిమా  ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. హీరో సాయి తేజ్, సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో మనసుల్ని చూరగొన్నారు. ఇక దర్శకుడు మారుతి... హీరో సాయి తేజ్ ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్ లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్ గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్ టైన్ మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుంది.  

Other film news