Loading. Please wait.

actress,actors gallery

`గుణ 369` టీజ‌ర్‌కు అద్భుత స్పంద‌న‌.

మ‌న `ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ‌ను ఇక‌పై అంద‌రూ `గుణ 369` హీరో
కార్తికేయ అని అన‌డం ఖాయం... అని ఘంటాప‌థంగా చెబుతున్నారు `గుణ 369`
చిత్రం టీజ‌ర్ చూసిన వాళ్లు`` అని అంటున్నారు శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల‌.
ఆమె స‌మ‌ర్పిస్తున్న చిత్రం `గుణ 369`.
స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్
నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌
జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.
``మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల మ‌న జీవితాని కి ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు. కానీ
ప‌క్క‌నోడి జీవితానికి ఏ హానీ జ‌ర‌గ‌కూడ‌దు`` అని సాయికుమార్  గంభీర‌మైన
స్వ‌రంతో చెప్పే మాట‌ల‌తో `గుణ 369` టీజ‌ర్ సోమ‌వారం ఉద‌యం విడుద‌లైంది.
టీజ‌ర్ రిలీజైన కొద్దీ క్ష‌ణాల్లోనే నెట్టింట్లో ట్రెండ్ అయింది.
ఆర‌డ‌గుల హీరో ఓ అమ్మాయి ముందు నిలుచుని `స్మైల్ ఇవ్వొచ్చు క‌దా ఒక్క
సెల్ఫీ..`, `నేనూ ఎప్పుడూ అనుకోలేదండీ. ఇలా బ‌ల‌వంతంగా ష‌ట్ట‌ర్ క్లోజ్
చేసి ఒక‌మ్మాయితో మాట్లాడ‌తాన‌నీ.. నాతో మీరు  మాట్లాడాల్సిన ప‌నిలేదు.
మీతో మీరు మాట్లాడేయండి` అని ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ చెప్పే డైలాగులు
యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. `మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్ల‌ను చూసి
భ‌య‌ప‌డేది, గొడ‌వ‌లంటే మూసుకుని కూర్చునేది మాకేద‌న్నా అవుతుంద‌ని కాదు.
మా అనుకున్న వాళ్ల‌కు ఏద‌న్నా అవుతుంద‌న్న చిన్న భ‌యంతో...` అని
టీజ‌ర్‌లో ఆఖ‌రిగా హీరో నోటి వెంట వ‌చ్చే డైలాగులు మాస్ జ‌నాల చేత
చ‌ప్ప‌ట్లు కొట్టిస్తున్నాయి. టీజ‌ర్‌కు వ‌స్తున్న స్పంద‌న గురించి
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``టీజ‌ర్ విడుద‌లైన కొన్ని క్ష‌ణాల నుంచే ఫోన్లు
మొద‌ల‌య్యాయి. టీజ‌ర్ చాలా బావుందంటూ అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు.
టీజ‌ర్‌లో డైలాగులు, లొకేష‌న్లు, న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్, కెమెరా,
కాస్ట్యూమ్స్... ఇలా ప్ర‌తి విష‌యం గురించి డీటైల్డ్ గా మాట్లాడుతుంటే
చాలా ఆనందంగా అనిపించింది. టీజ‌ర్ ఎంత బావుందో, సినిమా అంత‌కు వెయ్యి
రెట్లు బావుంటుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను. ఫ‌స్ట్ లుక్‌కు, ఇప్పుడు
టీజ‌ర్‌కు వ‌స్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి యూనిట్ అంతా ఆనందంగా
ఉన్నాం`` అని చెప్పారు.

Other film news