Loading. Please wait.

actress,actors gallery

"గద్దలకొండ గణేష్" 2 డేస్ బాక్సాఫీస్‌ కలెక్షన్స్

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేష్’ తొలిరోజే 6.7 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా ఈ చిత్రం సంచలనాలు రేపింది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా పాజిటివ్ మౌత్ టాక్ ఉండటంతో కలెక్షన్ల విషయంలో దుమ్ము దులిపేస్తున్నాడు గద్దలకొండ గణేష్. తొలిరోజు చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఇక రెండో రోజు కూడా కేవలం 30% వరకు మాత్రమే డ్రాప్ అయ్యాయి. 


రెండో రోజు మార్నింగ్, మ్యాట్నీలకు కాస్త తక్కువ కలెక్షన్లు వచ్చినా కూడా ఫస్ట్ అండ్ సెకండ్ షోలకు మాత్రం అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 4 కోట్ల వరకు షేర్ వచ్చిందని తెలుస్తుంది. తొలి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల షేర్ వచ్చేలా కనిపిస్తున్నాయి. 25 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం వారం రోజుల్లో సేఫ్ జోన్‌కు వచ్చేలా కనిపిస్తుంది.

Other film news