Kanchana 3 Heroine: కాంచన-3 మూవీ హీరోయిన్ ఆత్మహత్య!

8/23/2021
కాంచన-3 సినిమాలో దెయ్యం పాత్రలో నటించి సందడి చేసిన అలెగ్జాండ్రా జావి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో తాను బస చేసిన హోటల్‌ రూమ్‌లో విగతజీవిగా పడి ఉండటం కలకలం రేపుతోంది.
మోడల్‌గా రాణించిన అలెగ్జాండ్రా జావి.. ఆ తరువాత రాఘవ లారెన్స్‌ డైరెక్ట్‌ చేసిన కాంచన-3 సినిమాలో దెయ్యం క్యారెక్టర్‌లో నటించారు. కొన్నిరోజుల క్రితం అలెగ్జాండ్రా జావి తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి బ్రేకప్‌ చేసుకున్నారు.
అప్పటినుంచి ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిందని సమాచారం. ఆ బాధ తట్టుకోలేకే ఆమె గది పైకప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. అయితే ఆమెది ఆత్మహత్యా.? లేక ఎవరైనా హత్యా చేశారా.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, గతంలో ఈమె ఓ చెనై ఫోటోగ్రాఫర్‌ వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.

More news

Related News