ఆ వీడియోలో ఉన్నది RGV కాదట!

8/23/2021
పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారే రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి వార్తలో నిలిచారు. కొద్ది రోజుల క్రితం ఆరియానాతో బోల్డ్‌ ఇంటర్వ్యూ, మూడు రోజుల క్రితం ఆషురెడ్డితో పిచ్చి ఫొటో షూట్‌, రెండు రోజుల క్రితం ఇనయా సుల్తానా పుట్టినరోజున డాన్సులేస్తూ, ఆ అమ్మాయిని ఎక్కడెక్కడో తాకుతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వర్మ చేష్టలను ఆస్వాదించేవారు కొందరుంటే.. ఎక్కువ శాతం అతని తీరును విమర్శిస్తున్నారు. కొందరైతే మండిపడుతున్నారు. అయినా ఇవేమీ వర్మకు ఇంచుకున్నా పట్టవు. విమర్శలను కూడా ఆయన పొగడ్తలుగా భావిస్తున్నారు. లేదంటే ‘నాకు నచ్చింది నేను చేస్తాను మీకేంటి’ అని వ్యంగ్యంగా ఎదురు దాడికి దిగుతారు. అయితే ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన బర్త్‌డే వీడియో మీద వర్మ కార్లిటీ ఇచ్చాడు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. ‘‘మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మీద ఒట్టు’ అంటూ తనదైన స్టైల్‌లో వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.  అయితే ఈ ఇనయా సుల్తానా ఆర్‌జీవీ కొత్త చిత్రంలో హీరోయిన్‌ అని సమాచారం.

More news

Related News