Loading. Please wait.

actress,actors gallery

Uttej Mayukha Actiong School Press Meet

123
కళ దైవదత్తమే అయినా దానికి శిక్షణ అవసరం- ఎస్ వి కృష్ణారెడ్డి

థంబ్ లైన్ :
ఉత్తేజ్  "మయూఖ టాకీస్" సెకండ్ బ్యాచ్ ప్రారంభం

“నటన  అనే కళ దైవదత్తమే అయినప్పటికీ దానికి శిక్షణ అవసరం. అలాంటి  నటనలో  మంచి శిక్షణ 
ఇచ్చే "మయూఖ టాకీస్" యాక్టింగ్ స్కూల్ స్థాపించి మొదటి బ్యాచ్ కి  విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి
ఈరోజు రెండవ బ్యాచ్  క్లాసులను ప్రారంభిస్తున్న నటుడు, రచయిత, యాక్టింగ్ కోచ్ ఉత్తేజ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు"- అన్నారు ప్రముఖ దర్శకులు ఎస్ వి కృష్ణారెడ్డి.

ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడ లోని మయూఖ యాక్టింగ్ స్కూల్ సెకండ్ బ్యాచ్  ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ వి కృష్ణారెడ్డి 
“ నటుడు అనేవాడు తన మాతృభాష కే పరిమితం కాకుండా వీలైనన్ని ఇతర భాషలను కూడా నేర్చుకునేందుకు  ప్రయత్నించాలి. అప్పుడే ప్రకాష్ రాజ్ గారి లాగా బహుభాషా నటుడిగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కొత్తగా శిక్షణ ప్రారంభిస్తున్న యాక్టింగ్ స్టూడెంట్స్ అందరికీ ఈ మయూఖ యాక్టింగ్ స్కూల్ ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఏర్పడాలని కోరుకుంటున్నాను" అన్నారు.

సీనియర్ నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ" ఉత్తేజ్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. తను స్థాపించిన మయుఖా యాక్టింగ్ స్కూల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి నటీనటులను అందిస్తుంది అనటంలో సందేహం లేదు. తపన, అంకిత భావం ఉన్న వాళ్లను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ నిరాశ పరచదు" అన్నారు.

Other film news