Loading. Please wait.

actress,actors gallery

రంజాన్ కానుకగా జూన్ 7న "కిల్లర్" భారీ విడుదల..!

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌
కలిసి నటిస్తున్న చిత్రం 'కొలైగారన్‌'.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో
నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై
టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల
చేస్తున్నారు.  అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది.  సైమన్.కె.కింగ్ సంగీతం
సమకూరుస్తున్న ఈ సినిమా కి మాక్స్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు..కాగా
 ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగ విజయ్
ఆంటోనీ, అర్జున్ ల కలయికగా తో వస్తున్న ఈ సినిమా కి భారీ డిమాండ్
ఏర్పడింది.. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా
యూ/ఏ సర్టిఫికెట్ పొందగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రంజాన్
కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. యాక్ష‌న్ కింగ్ అర్జున్ , హీరో
విజయ్ ఆంటోనీ లు నటించిన కిల్లర్ చిత్రానికి తెలుగులో మంచి బిజినెస్
జరిగింది.. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు..
ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ అంశాలు అన్ని ఇందులో ఉన్నాయి.. సినిమా
ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..  సెన్సార్ పూర్తయ్యింది.. జూన్ 7
న గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం.. అన్నారు..

నటీనటులు : అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నార్వాల్, నాజర్, సీత, భగవతి
పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్

సాంకేతిక నిపుణులు :
రచయిత & దర్శకుడు: ఆండ్రూ లూయిస్
నిర్మాతలు: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్
బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌
సంగీతం: సైమన్ కే కింగ్
సాహిత్యం మరియు సంభాషణలు: భాష్యశ్రీ
సినిమాటోగ్రఫీ: మాక్స్
ఎడిటర్: రిచర్డ్ కెవిన్
ఆర్ట్ : వినోద్ రాజ్ కుమార్

Other film news