దర్శకరత్న డాక్టర్ దాసరి విగ్రహావిష్కరణ

శతాధిక చిత్ర దర్శకులు కీర్తిశేషులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ మహోత్సవం 26 - 01 - 2019న “దాసరి విగ్రహ నిర్మాణ కమిటీ ” ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పాలకొల్లులో జరగనుంది. చలనచిత్ర, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దాసరి నారాయణరావు ప్రియ శిష్యులు, సుప్రసిద్ధ నటులు, నిర్మాత, విద్యావేత్త డాక్టర్ మంచు మోహన్ బాబు విగ్రహావిష్కరణ కర్తగా పాల్గొనడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఆధ్వర్యంలో దాసరి సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది. దాసరి అభిమానులు, శిష్యులు,కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

Other film news