ఏప్రిల్ 12న సాయిధ‌ర‌మ్ తేజ్‌, కిషోర్ తిరుమ‌ల, మైత్రీ మూవీ మేక‌ర్స్ `చిత్రల‌హ‌రి` విడుద‌ల‌

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ - ``కిషోర్ తిరుమల సినిమా అంటే కూట్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటూనే ఎమోష‌న్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌తో చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కుతోంది. షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయ‌న సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. సాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమ‌ల‌గారు ప్రెజంట్ చేస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం`` అన్నారు. ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ - ``మంచి ఎమోష‌న‌ల్ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రల‌హ‌రి తెర‌కెక్కుతోంది. టైటిల్‌లో ఐదు అక్ష‌రాలు ఉన్న‌ట్లు సినిమాలో ఐదు క్యారెక్ట‌ర్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ‌గా ఉంటాయి. సినిమా ఈ పాత్ర‌ల చుట్టూ ఎక్కువ‌గా తిరుగుతుంది. సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది`` అన్నారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని.

Other film news