Loading. Please wait.

actress,actors gallery

ఆడపడుచులతో జనసేన పార్టీ కమిటీలు

ఆడపడుచులతోజనసేన పార్టీ కమిటీలు

తొలి జాబితావిడుదల చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

దేశ రాజకీయాల్లో బలమైన పాత్రపోషించాలి... బడుగు వర్గాలకు సముచిత రాజకీయ ఫలాలు దక్కాలి... మహిళాశక్తికి రాజకీయ సాధికారిత అందించాలన్న తలంపుతో రెండు దశాబ్దాలుగా తనఆలోచనలకు ఒక రూపాన్ని ఇస్తూ తీర్చిదిద్దిన జనసేన పార్టీ కమిటీలను పార్టీఅధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం ఆవిష్కరించారు. సమకాలీన రాజకీయపార్టీల కమిటీ నిర్మాణాలకు భిన్నంగా, భవిష్యత్తు భారతావని అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కమిటీలకు శ్రీ పవన్కళ్యాణ్ గారు రూపకల్పన చేశారు. పార్టీ అధ్యక్షుని నేతృత్వంలో పార్టీ కేంద్ర కమిటీపనిచేస్తుంది. ఈ కేంద్ర కమిటీతో పాటు ప్రెసిడెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్ను  ఏర్పాటుచేశారు. ఇందులో అనేక ప్రజాపయోగకౌన్సిల్స్, కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారుగా 22 కమిటీలలో మహిళలకు తొలివిడతగా చోటు కల్పించారు. తొలుతఆడపడుచులతో కమిటీలు ఏర్పాటుచేయడం శుభప్రదంగా భావించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా ప్రస్తుతంప్రకటిస్తున్న కమిటీలకు స్వయంగా రూపకల్పన చేస్తూ వస్తున్నారు. ఈ కమిటీలలో స్థానందక్కించున్న ప్రతి ఒక్కరు ఆయనకు సుపరిచితులే. వారి శక్తి సామర్ధ్యాలపై ఆయనకు పూర్తిఅవగాహన వుంది. గత నాలుగు సంవత్సరాలుగా పార్టీకి వీరంతా సేవలందిస్తున్నారు. అధ్యక్షుడు పాల్గొన్న సమావేశాలు, కార్యక్రమాలలో వీరు పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరి సమాచారం శ్రీ పవన్ కళ్యాణ్గారి కంప్యూటర్లో నిక్షిప్తమై వుంది. ప్రస్తుతం పదవులు పొందినవారంతా నవ వయస్కులు, విద్యాధికులు..డాక్టర్లు, లెక్చరర్లు, న్యాయవాదులు, ఐ.టి.నిపుణులతోపాటుగృహిణిలు కూడా వీరిలో వున్నారు. కెరీర్ ను వదులుకుని ప్రజా సేవ కోసం వచ్చినఆడపడుచులు ఎందరో వీరిలో వున్నారు. ఇది తొలి జాబితా మాత్రమే.

మరి కొందరు మహిళ సీనియర్నాయకులకు వారి అనుభవం, సామర్థ్యాన్ని బట్టి ఏకమిటీలో ఎటువంటి పదవి ఇవ్వాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. త్వరలోనే వారికి కూడామాలి జాబితాలో సముచిత స్థానాలు లభిస్తాయి. మహిళలతో ఉన్న కమిటీల తొలి జాబితాకు రూపకల్పన చేయడం తనకు ఆనందాన్నికలిగించిందని శ్రీ పవన్ కళ్యాణ్ గారుఅన్నారు. ఈ కమిటీలలో వున్నవారు ఎంతో ప్రభావశీలురని కొన్ని ఉదాహరణలను చెప్పారు.విమెన్ వింగ్ (వీరమహిళ ) కు ఛైర్మెన్ గా నియమించిన కర్నూలుకు చెందిన జవ్వాజి  రేఖ (25- గౌడ) ఆడిటర్ గా పనిచేస్తూ పార్టీకి విలువయిన సేవలందిస్తున్నారు.కార్యాకర్తలకోసం ఆర్ధరాత్రి సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్ళడానికి కూడా వెనుకాడరు. వైస్చైర్మన్లుగా భీమవరానికి చెందిన  సింధూరికవిత (25 -క్షత్రియ  ), షేక్ జరీనా (28 - ముస్లిం-నరసరావుపేట) , నూతాటి ప్రియా సౌజన్య ( 30 -కాపు- రాజమండ్రి) , జి.శ్రీవాణి ( 47 -ఓసీ-హైదరాబాద్ )నియమితులయ్యారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకు రావడానికి వీరు  నిత్యం శ్రమిస్తూనే వుంటారు.Other film news